Hyderabad, మార్చి 17 -- OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ లేదా వెబ్ సిరీస్ అంటే ఓటీటీలో మినిమం గ్యారెంటీ అనేది మేకర్స్ కు అర్థమైపోయింది. ఇప్పుడందుకే భాషతో సంబంధం లేకుండా చాలా వరకు ఈ జానర్ కంటెంట్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగులోనూ టచ్ మి నాట్ (Touch Me Not) పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది.

టచ్ మి నాట్ వెబ్ సిరీస్ ను జియోహాట్‌స్టార్ తీసుకొస్తోంది. నవదీప్, దీక్షిత్ శెట్టి నటించిన ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సోమవారం (మార్చి 17) సరికొత్త పోస్టర్ ద్వారా మరోసారి వెల్లడించింది. "నిజాన్ని అసలు తాకలేము అంటే ఏం జరుగుతుంది?

దానికి దగ్గరగా వెళ్లిన కొద్దీ అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. వాళ్లు ఈ కేసును ఛేదించగలరా? టచ్ మి నాట్ జియోహాట్‌స్టార్ లో త్వరలోనే" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది....