Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మెయిన్ రోల్‌లో నటిస్తున్న కోస్టావో మూవీని జీ5 ఓటీటీ తీసుకొస్తోంది. గోవా సినిమాటిక్ చరిత్రలో ఒక కొత్త, అదిరిపోయే చాప్టర్‌గా ఉండబోతోంది. ఈ సినిమా 1990ల నాటి కథతో వస్తోంది. ఆ కాలంలో బీచ్‌ల స్వర్గంగా పేరున్న గోవా.. మిస్టరీలతో, పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ దందాలతో, నేరాలతో నిండి ఉండేది.

భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ 'కోస్టావో'ను తెరపైకి తెస్తోంది. బాంబే ఫేబుల్స్ మోషన్ పిక్చర్స్, వినోద్, కమలేష్, భావేష్, సేజల్, శ్యామ్ భానుశాలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోవాకు చెందిన ధైర్యవంతుడైన కస్టమ్స్ ఆఫీసర్ మిస్టర్ కోస్టావో ఫెర్నాండెజ్ నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉద్యోగం పట్ల తనకు ఉన్న అంకితభావంతో దేశ చరిత్రల...