భారతదేశం, మార్చి 15 -- మలయాళ నటుడు కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో కమర్షియల్‍గా మంచి కలెక్షన్లు దక్కాయి. మలయాళంలో ఈ చిత్రం ఫిబ్రవరి 20త తేదీన విడుదలై సక్సెస్ అయింది. ఈ చిత్రం తెలుగులో ఈ శుక్రవారమే (మార్చి 14) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అప్పుడే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేసుకుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం మార్చి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 15) వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆఫీసర్ చిత్రం మార్చి 20న స్ట్రీమింగ్‍కు వస్తుందని నెట్‍ఫ్లిక్స్ ప్రకటించింది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం తెలుగులో ...