భారతదేశం, మార్చి 16 -- మరో మలయాళ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషిచించిన పొన్‍మ్యాన్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఓటీటీలో ఐదు భాషల్లో వచ్చిన ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా భారీ వ్యూస్ సాధిస్తోంది. దీంతో పొన్‍మ్యాన్ మూవీ ట్రెండింగ్‍లోకి వచ్చేసింది.

పొన్‍మ్యాన్ మూవీ మార్చి 14న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

పొన్‍మ్యాన్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీ ట్రెండింగ్‍లో దూసుకొచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. తొలి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన...