భారతదేశం, ఫిబ్రవరి 15 -- బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ, హీరోయిన్ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ధూమ్ ధామ్ చిత్రంపై ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో రూపొందిన ధూమ్ ధామ్ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్ చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంది. ఆ వివరాలు ఇవే..

ధూమ్ ధామ్ చిత్రం తాజాగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో కాకుండా ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ధూమ్ ధామ్ టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ గురించి మేకర్స్ చెప్పలేదు. ప్రమోషన్ కంటెంట...