భారతదేశం, మార్చి 19 -- డైరెక్టర్ శక్తివేల్ దర్శకత్వం వహించిన 'రింగ్ రింగ్' చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో ప్రవీణ్ రాజ్, వివేక్ ప్రసన్న, సాక్షి అగర్వాల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ తమిళ కామెడీ డ్రామా చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ రింగ్ రింగ్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.

రింగ్ రింగ్ సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే టెంట్‍కొట్ట అనే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ చిత్రం మార్చి 21న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇలా ఆహా తమిళ్, టెంట్‍కొట్ట రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.

ఓ పుట్టిన రోజు పార్టీ కోసం చిన్ననాటి స్నేహితులంతా ఓ చోట కలుస్తారు. ఈ సెలెబ్రేషన్ల...