భారతదేశం, ఫిబ్రవరి 3 -- మలయాళ స్టార్ యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్ర పోషించిన 'వివేకానందన్ వైరలను' చిత్రం గతేడాది 2024 జనవరిలో థియేటర్లలో రిలీజైంది. డిఫరెంట్ పాయింట్‍లో ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ రూపొందింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. తెలుగులో 'వివేకానందన్ వైరల్' పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డేట్ ఫిక్స్ అయింది.

వివేకానందన్ వైరల్ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (ఫిబ్రవరి 3) వెల్లడించింది. పగలబడి నవ్వేందుకు రెడీగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వివేకానందన్ వైరలను చిత్రం గతేడాది జనవరి 19వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత తెలుగు ...