భారతదేశం, మార్చి 24 -- హరి భాస్కర్, లోసిల్య మరియనేసన్ ప్రధాన పాత్రల్లో మిస్టర్ హౌస్‍‍కీపింగ్ సినిమా వచ్చింది. ఈ ఏడాది జనవరి 24న ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలైంది. ఈ లోబడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే పర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాకు అరుణ్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మిస్టర్ హౌస్‍‍కీపింగ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ సినిమా రేపు (మార్చి 25) 'ఆహా తమిళ్' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. టెంట్‍కొట్ట ఓటీటీలోనూ మార్చి 25నే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

మిస్టర్ హౌస్‍‍కీపింగ్ చిత్రంలో హరి భాస్కర్, లోసిల్యతో పాటు ఇళవరసు, రాయన్, జవహర్ శక్తి, షా రా, ఎంజే శ్రీరామ్, ఉమా రామచంద్రన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిం...