Hyderabad, ఫిబ్రవరి 25 -- OTT Bold Web Series: తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఎమోజీ (Emoji). కాస్త బోల్డ్ సీన్స్, డైలాగులతో యువతను ఆకట్టుకునేలా మేకర్స్ ఈ సిరీస్ తీశారు. అయితే దీనికి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ ను అదే పేరుతో తెలుగులోకీ తీసుకొస్తున్నారు. ఆహా వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఎమోజీ అనే తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 28) నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మంగళవారం ఆహా వీడియో ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా నిమిషం నిడివి ఉన్న ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది.

"లవ్, ప్యాషన్, డెస్టినీ.. వాళ్లు మళ్లీ కలుసుకుంటారా? ఎమోజీ ఫిబ్రవరి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా రిల...