భారతదేశం, ఫిబ్రవరి 27 -- కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ హీరోగా నటించిన భైరాతి రణగల్ చిత్రం మోస్తరుగా ఆడింది. గతేడాది నవంబర్ 15వ తేదీన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కన్నడలో రిలీజైంది. చాలా అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ సినిమాకు నర్తన్ దర్శకత్వం వహించారు. భైరాతి రణగల్ మూవీ ఇప్పుడు మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇస్తోంది.

భైరాతి రణగల్ మూవీ రేపు (ఫిబ్రవరి 28) తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే కన్నడలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఉంది. తెలుగులో ఇటీవల మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు సన్‍నెక్స్ట్ ఓటీటీలోనూ అడుగుపెడుతోంది.

భైరాతి రణగల్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో ఇటీవలే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఫిబ్రవరి 13న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆహాలో అడుగుప...