భారతదేశం, మార్చి 30 -- బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన దేవా మూవీ మంచి బజ్‍తో వచ్చింది. జనవరి 31వ తేదీన ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత జోరు చూపలేకపోయింది. కమర్షియల్‍గా ఈ సినిమా చతికిలపడింది. రీసెంట్‍గానే ఓటీటీలోకి వచ్చిన దేవా ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.

దేవా చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. సినిమాల విభాగంలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రెండో రోజుల కిందట ఫిబ్రవరి 28న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ స్ట్రీమ్ అవుతోంది. రెండు రోజుల్లోనే నెట్‍ఫ్లిక్స్ సినిమా ట్రెండింగ్‍లో దేవా ఫస్ట్ ప్లస్‍కు వచ్చింది.

దేవా చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు స...