Hyderabad, ఫిబ్రవరి 18 -- OTT Action Thriller: ఓటీటీలోకి మూడు రోజుల కిందట వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ (Max). కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. 72 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది.

కిచ్చా సుదీప్ మాస్ అవతారంలో కన్నడ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మూవీ మ్యాక్స్. ఈ సినిమా గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 50 రోజుల తర్వాత ఫిబ్రవరి 15 నుంచి జీ5 ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే రోజు జీ కన్నడలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా రావడం విశేషం.

అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. కన్నడ వెర్షన్ తోపాటు తెల...