Hyderabad, ఫిబ్రవరి 24 -- OTT Action Thriller: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన మూవీ విదాముయర్చి (Vidaamuyarchi). త్రిష కృష్ణన్ ఫిమేల్ లీడ్ గా కనిపించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (ఫిబ్రవరి 24) అనౌన్స్ చేసింది.

అజిత్, త్రిష జంటగా నటించిన విదాముయర్చి మూవీ మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ మూవీలో అజిత్ ఓ ఇంటెన్స్ లుక్ లో కనిపించే పోస్టర్ ను షేర్ చేస్తూ రిలీజ్ డేట్ తెలిపింది.

"బ్రేక్స్ లేవు. లిమిట్స్ లేవు. కేవలం విదాముయర్చి. ఈ విదాముయర్చి మూవీని నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 3 నుంచి తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలలో చూడండి" అనే క్యాప్ష...