Hyderabad, ఫిబ్రవరి 25 -- OTT Action Movie: తమిళ యాక్షన్ మూవీ ఒకటి ఇప్పుడు తెలుగులో నేరుగా ఓటీటీలోకే వస్తోంది. నిహారిక కొణిదెల నటించిన ఈ సినిమా పేరు మద్రాస్కారణ్ (Madraskaaran). ఈ తమిళ యాక్షన్ మూవీ పొంగల్ సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ నెల మొదట్లో తమిళ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడు తెలుగులోనూ అడుగుపెడుతోంది.

మద్రాస్కారణ్ మూవీ తెలుగు వెర్షన్ ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా బుధవారం (ఫిబ్రవరి 26) నుంచే ఇందులో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ల జీవితాలను మార్చే సంఘర్షణకు దారి తీసింది. ఒక్క క్షణం ఎప్పటికీ మన దృక్ఫథాన్ని, పరిస్థితులను మార్చేస్తుందో చూడండి. మద్రాస్కారణ్ ఫిబ్రవరి 26 నుంచి ఆహాలో" అనే క్యాప్ష...