భారతదేశం, ఫిబ్రవరి 16 -- దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‍గా ఉన్న కీర్తి సురేశ్.. బాబీ జాన్ మూవీతో బాలీవుడ్‍లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక పోయింది. బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్‍గా చేశారు కీర్తి సురేశ్. ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో ఓటీటీలో ఉంది. అయితే, ఈ వారం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.

బాబీ జాన్ చిత్రం ఈ గురువారం ఫిబ్రవరి 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ ఫిబ్రవరి 5న రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. రూ.249 రెంట్ చెల్లించి చూసేలా ఉంది. అయితే, ఫిబ్రవరి 20న ఆ రెంట్ తొలగిపోనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍...