భారతదేశం, మార్చి 4 -- అనోరా చిత్రానికి ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఆస్కార్ 2025ల్లో ఐదు అవార్డులను ఈ రొమాంటిక్ కామెడీ మూవీ సొంతం చేసుకుంది. బెస్ట్ చిత్రం, బెస్ట్ డైరెక్షన్‍తో పాటు మరో మూడు పురస్కారాలు దక్కాయి. ఈ అనోరా మూవీ ఇప్పుడు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో రెంటల్ పద్ధతిలో ఈ చిత్రం ఉంది. రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా రివీల్ అయింది.

అనోరా చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ ఓటీటీ నేడు (మార్చి 4) అధికారికంగా వెల్లడించింది. పీకాక్ హబ్ ద్వారా ఈ మూవీని తీసుకొస్తోంది. "ఈ ఏడాది ఎక్కువ అకాడమీ అవార్డులు గెలిచిన చిత్రాన్న మీ స్కీన్‍లోకి తీసుకొస్తున్నాం. అనోరా మార్చి 17 నుంచి జియోహాట్‍స్టార్ ఓటీటీలో పీక...