భారతదేశం, జనవరి 31 -- ప్రపంచవ్యాప్తంగా వివిధ గ్లోబల్ స్టేజీలపై అదరగొట్టిన బాలీవుడ్ మూవీ 'కెన్నెడీ'. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా ఇతర ఫిల్మ్ ఈవెంట్లలో ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ ఇప్పటికీ థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది ఈ నియో నోయర్ జోనర్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషించింది.

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కెన్నెడీ. ఇందులో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రశంసలు పొందింది. కానీ అప్పటి నుంచి థియేటర్ రిలీజ్ మాత్రం కాలేదు. ఇప్పడు డైరెక్ట్ గా జీ5 ఓటీటీలోకి రాబోతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి సెన్సార్ సర్టిఫికేట్ పొందినా ఈ మూవీ ఎందుకో రిలీజ్ కాలేదు.

శనివారం (జనవరి 31) తన ఇన్ స్టాగ్ర...