భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్త సినిమాలు సందడి ఎక్కువగానే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, జోనర్లలో తెరకెక్కిన చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తుంటాయి. ఈ రోజు (ఫిబ్రవరి 6) అలాగే ఓటీటీలోకి వచ్చిన మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా 'నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్'. ఊర్లో తిరిగే వింత ఆకారాన్ని కనిపెట్టాలనే లక్ష్యంతో ఉండే ఓ గ్యాంగ్ కథ ఇది.

ఓటీటీలో మలయాళం సినిమాలకు క్రేజ్ ఎక్కువే. ఇక ఇందులో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ సినిమాలు అయితే దక్కే ఆదరణ మరో లెవల్ లో ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ తరహా మలయాళం సినిమాలను ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి సినిమా నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ సినిమా మూడు నెలల తర్...