భారతదేశం, ఫిబ్రవరి 2 -- తమిళ మూవీ 'టెస్ట్'పై ఆసక్తి బాగానే ఉంది. స్టార్ యాక్టర్లు మాధవన్, నయనతార, సిద్ధార్థ్ కలిసి నటించడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, టెస్ట్ మూవీ నుంచి చాలా కాలంగా పెద్దగా అప్‍డేట్లు రాలేదు. అయితే, ఈ స థియేటర్లలో కాకుండా ఓటీటీలోకే నేరుగా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన ముగ్గురు సోషల్ మీడియాలో నేడు (ఫిబ్రవరి 2) చేసిన పోస్టుతో డైరెక్ట్ స్ట్రీమింగ్ అనే అంచనాలు వచ్చాయి. ఆ వివరాలు ఇవే..

మాధవన్, నయనతార, సిద్ధార్థ్.. తమ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్లలో ఓ పోస్ట్ చేశారు. "నెట్‍ఫ్లిక్స్‌లో నెక్స్ట్ ఏం రానుందో.. ఫిబ్రవరి 3న చూడండి" అంటూ షేర్ చేశారు. ఫిబ్రవరి 3 కోసం మీరు రెడీ ఉండడనేలా రాసుకొచ్చారు. ముగ్గురు వారివారి ఫొటోలతో ఈ పోస్ట్ చే...