భారతదేశం, జనవరి 31 -- ఈ రోజుల్లో మాటలు లేని సినిమా తీయడం రిస్క్. కానీ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి స్టార్ నటులతో మేకర్స్ ఆ రిస్క్ చేశారు. ఎలాంటి డైలాగ్ లు లేని మూకీ సినిమాగా 'గాంధీ టాక్స్'ను తెరకెక్కించారు. జనవరి 30న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో గాంధీ టాక్స్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.

ఇటీవల థియేటర్లలో విడుదలైన లేటెస్ట్ సైలెంట్ కామెడీ డ్రామా 'గాంధీ టాక్స్'. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఏ ఓటీటీలోకి సినిమా వస్తుందనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం గాంధీ టాక్స్ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.

'గాంధీ టాక్స్' సినిమా జీ5లో తన ఓటీటీ డెబ్యూ చేయడం ఖాయమైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే జీ5తో ఓటీటీ డీల్ జరిగ...