భారతదేశం, మార్చి 16 -- టెస్ట్ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. సిద్ధార్థ్, నయనతార, మాధవన్ లాంటి స్టార్ యాక్టర్స్ కలిసి ఈ మూవీలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది కూడా ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై క్యూరియాసిటీ మరింత పెంచింది. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం సాగుతుంది. టెస్ట్ చిత్రం నుంచి మాధవన్ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ తాజాగా ఓ టీజర్ తీసుకొచ్చారు మేకర్స్.

టెస్ట్ చిత్రంలో సైంటిస్ట్ శవరణన్ పాత్రను మాధవన్ పోషిస్తున్నారని కొత్త టీజర్ ద్వారా రివీల్ అయింది. ఫ్యుయల్ సెల్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణను శరవణ్ (మాధవన్) చేసి ఉంటాడు. అయితే, దానికి అనుమతి పొందేందుకు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటాడు. కొందరు డబ్బు కూడా అడుగుతారు. దీంతో తన కలను సాకారం చేసుకునేందుకు అనేక కష్టాలను శరవణ్ పడతాడు. సవాళ్లను ఎ...