భారతదేశం, ఫిబ్రవరి 1 -- నవ్వించేవి కొన్ని, ఏడిపించేవి కొన్ని, సస్పెన్స్ తో ఉర్రూతలూగించేవి కొన్ని.. ఇలా డిఫరెంట్ సినిమాలు ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇందులో సౌత్ సినిమాల డామినెన్స్ ఎక్కువ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ కూడా ఎక్కువే. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన ఈ 6 సౌత్ ఇండియన్ మూవీస్ మిమ్మల్ని కచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి.

తమిళంలో వచ్చిన అదిరిపోయే ఎమోషనల్ డ్రామా 'మెయ్యాజగన్'. ఇందులో కార్తి, అరవింద్ స్వామి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. చిన్నప్పుడు సరదాగా కలిసి గడిపిన ఇద్దరు చుట్టాలు.. పెద్దయ్యాక తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవడం హైలైట్ గా నిలిచింది. మనలో చాలా మంది చాలా కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ల కథ ఇది.

మనసును హత్తుకునే మరో తమిళ డ్రామా 'ఇడ్లీ క...