భారతదేశం, జనవరి 29 -- పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.

"దేవగుడి" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి దేవగుడి మూవీ విశేషాలు, హైలెట్స్ పంచుకున్నారు.

-నేను ఉద్యోగం చేస్తున్న టైమ్‌లో భగవద్గీత ఆధారంగా యధాతథం అనే కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. భగవద్గీత మత గ్రంథం అనుకుంటారు గానీ అది సైంటిఫిక్‌గా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్‌తో మూవీ నిర్మించాలని శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేశాం.

-...