భారతదేశం, ఫిబ్రవరి 1 -- ధురంధర్.. 2025 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ గా మారింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది. ఇండియా నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ పై లేడీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ఫైర్ అవడం హాట్ టాపిక్ గా మారింది.

ధడక్ 2 మూవీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ధురంధర్ మూవీపై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం (ఫిబ్రవరి 1) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ చిత్రాన్ని విమర్శించారు.

ధురంధర్ టైటిల్ ట్రాక్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా సెట్ చేసిన షాజియా.. "ఎంత చెడు సినిమా! ఈ మూవీ దాక్కోలేదు. అలాగే ఇది అనుకోకుండా తీసింది కాదు. విద్వేషాన్ని ప్రేరేపించడం, హింస ఈ సినిమా డీఎన్ఏలోనే ఉంది'' అని షాజియా ఫైర్ అయ్యారు.

మైనారిటీ వర్గాలపై ...