భారతదేశం, మార్చి 20 -- ఈవారం వివిధ ఓటీటీల్లో తమిళ చిత్రాలు క్యూకట్టేస్తున్నాయి. ఓటీటీలో తమిళ సినిమాలు చూడాలనుకునే వారికి మంచి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఒకే రోజు ఐదు చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బ్లాక్‍బస్టర్ డ్రాగన్ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. నీక్ కూడా అడుగుపెట్టనుంది. మరో మూడు చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఈవారంలో ఒకే రోజు (మార్చి 21) ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ఐదు తమిళ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ చిత్రం రేపు (మార్చి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లతో థియేటర్లలో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమి...