భారతదేశం, జనవరి 31 -- ఓటీటీ లవర్స్ కు పండగే. థియేటర్లలో సంక్రాంతి 2026కు పర్ఫెక్ట్ మూవీ పండగ అందించిన తెలుగు, తమిళ సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ది రాజాసాబ్ నుంచి నారీ నారీ నడుమ మురారి వరకు ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళం కలిపి 7 సినిమాలు వచ్చాయి. ఇవి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సై అంటున్నాయి.

2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించింది. ఈ పండగ సందర్భంగా జనవరి 9న ది రాజాసాబ్, పరాశక్తి (తమిళం), జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి, జనవరి 14న అనగనగా ఒక రాజు, వా వాతియార్ (తమిళం), నారీ నారీ నడుమ మురారి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.

సంక్రాంతి 2026 సినిమాల్లో ఇప్పటికే ఓ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కార్తి హీరోగా నటించిన తమిళ మూవీ వా వాతియార్. ఇది తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో అమెజాన...