భారతదేశం, ఫిబ్రవరి 10 -- వాలెంటైన్స్ వీక్ నడుస్తున్న ఈ వారంలో ఓటీటీల్లోకి వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 10 - 15) మరికొన్ని సినిమాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఓ నాలుగు చిత్రాలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. అందులో బ్లాక్‍బస్టర్ చిత్రం మార్కో కూడా ఒకటి. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. స్టార్ హీరోయిన్ నిత్యా మేనన్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. మరో రెండు హిందీ మూవీస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్న వాటిలో 4 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

మార్కో చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మ...