భారతదేశం, ఏప్రిల్ 25 -- Laapataa Ladies OTT: 'లాపతా లేడీస్' సినిమా ట్రైలర్‌తో ఆసక్తిని రేపింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ కూడా ఈ మూవీ నిర్మాతల్లో ఉన్నారు. లాపతా లేడీస్ సినిమా ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‍తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. ఈ లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

లాపతా లేడీస్ సినిమా రేపు (ఏప్రిల్ 26) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు ప్రకటించింది. స్ట్రీమింగ్‍కు తీసుకురానున్న ఒక్క రోజు ముందు సడెన్‍గా ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది.

ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 26) నుంచి లాపతా లేడీస్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని సోషల్ మీడియ...