భారతదేశం, మార్చి 14 -- ఏప్రిల్​లో ఫైండ్ ఎక్స్8 అల్ట్రాను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసుకుంటోంది ఒప్పో. ఈ స్మార్ట్​ఫోన్ కెమెరా సెటప్ ఇప్పటికే మంచి బజ్​ను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఒప్పో ఫైండ్​ సిరీస్​ హెడ్​ ఝౌ యిబావో ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చారు. ఈ స్మార్ట్​ఫోన్​ కెమెరా సిస్టెమ్​ స్నీక్​పీక్​ని అందించారు. ఇందులో 5 సెన్సార్లు ఉన్నాయి. ఒప్పోకు ఇది చాలా కొత్త విషయం! తమ గ్యాడ్జెట్స్​లో ఫొటోగ్రఫీని మెరుగుపరిచేందుకు ఒప్పో ప్లాన్​ చేస్తున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.

రాబోయే ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా స్మార్ట్​ఫోన్​ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అధునాతన కెమెరా ఫీచర్లతో రానుంది. మరింత ఖచ్చితమైన ఇమేజింగ్, కలర్​ రీప్రొడక్షన్​ని అందించడానికి రూపొందించిన మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్ ఇందులో ఒకటి. మంచి స్కిన్ టోన్​లతో పోర్ట్రెయిట్​లను క్యాప్చర...