భారతదేశం, మే 7 -- Ooty, Kodaikanal: నీలగిరి, కొడైకెనాల్‌లో సేద తీరాలనుకునే పర్యాటకులకు నేటి నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈపాస్‌ తప్పనిసరి చేశారు. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మద్రాసు హైకోర్టు ఆదేశాలతో మే 7 మంగళవారం నుంచి ఊటీ , కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు రిజిస్ట్రేషన్, ‎ఈపాస్‌ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్‌ పర్యటనతో పాటు అక్కడ బస చేయడానికి ముందస్తు అనుమతి పొందాలి.

పర్యాటకులు తమ వ్యక్తిగత వివరాలు, వాహనాల నంబరు, ఊటీ, కొడైకెనాల్ వచ్చే రోజు, బస చేసే రోజులు వంటి వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైం...