భారతదేశం, మార్చి 6 -- Nothing Phone 3a Offer: నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇక్కడ కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసి గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ (GEV) ను పొందవచ్చు. ఈ ఆఫర్ సేల్ ప్రారంభమైన మొదటి రోజున మాత్రమే అందుబాటులో ఉంటుంది. నథింగ్ ఫోన్ 3ఎ లేదా ఫోన్ 3ఎ ప్రో కొనుగోలు చేసిన వినియోగదారులు వారి పాత స్మార్ట్ ఫోన్ కు పూర్తి ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు.

పూర్తి ఎక్స్ చేంజ్ వ్యాల్యూ అందించే ఈ జీఈవీ ప్రోగ్రామ్ 2021 లేదా ఆ తర్వాత విడుదలైన వన్ ప్లస్, శాంసంగ్, నథింగ్ వంటి బ్రాండ్ ల ఆండ్రాయిడ్ పరికరాలను కవర్ చేస్తుంది. అలాగే, 2019 తర్వాత లాంచ్ అయిన ఐఓఎస్ డివైజ్ లకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని గుర్తుంచుకోవాలి. ఈ ఆఫర్ నథింగ్ ఫోన్ (3ఎ) సిరీస్ సేల్ ప్రారంభమైన ...