Hyderabad, ఫిబ్రవరి 28 -- NNS 28th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ, రాథోడ్ కలిసి అనామికకు క్లాస్ పీకుతారు. అమర్ కు ఏ పని చేసి పెట్టొద్దని, పిల్లల పని తప్ప మరొకటి పట్టించుకోకూడదని ఆమెకు స్పష్టంగా చెబుతారు. అటు తనపై దాడి చేయించింది మనోహరే కాదో తెలుసుకోవడానికి రణ్‌వీర్ ప్లాన్ చేస్తుంటాడు.

అమర్ రూమ్ లోకి అనామిక వెళ్లడం, డోర్ లాక్ కావడంతో కంగారు పడుతూ మిస్సమ్మ, రాథోడ్ పైకి వెళ్తారు. అటు శివరాం, నిర్మల కూడా వస్తారు. డోర్ ఎంతకీ రావడంతో లోపలి నుంచి అమర్.. బయటి నుంచి మిగిలిన వాళ్లందరూ ప్రయత్నిస్తుంటారు.

ఈలోపల డోర్ ను బలంగా తన్ని తీయాలని భాగీ చూస్తుంది. అంతలో లోపలి నుంచి అమర్ డోర్ తీయడంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి అమర్ తో కలిసి సోఫాలో పడుతుంది. అందరి ముందే...