Hyderabad, ఫిబ్రవరి 25 -- NNS 25th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 25) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అనామికను ఉద్యోగంలో నుంచీ తీసేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటాడు అమర్. భాగీ కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉంటుంది. ఆ సమయంలో అంజు మరో కథ అల్లి అనామికను కాపాడుతుంది.

పిల్లలే తనకు టైమ్ టేబుల్ తప్పుగా చెప్పారని అమర్ తో చెప్పలేక అనామిక అలా ఉండిపోతుంది. అయితే మనస్ఫూర్తిగా అమర్ కు క్షమాపణ చెప్పాలన్న చిత్రగుప్తుడి సూచనతో తిరిగి ఇంట్లోకి వస్తుంది. అదే సమయంలో అమర్ కు అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంజు. ఇందులో అనామిక తప్పేమీ లేదని ఆమె చెబుతుంది.

నాన్నమ్మ, తాతయ్య బాగుండాలని తామే జాగారం చేశామని, రాత్రంతా మేల్కోవడంతో ఉదయాన్నే అనామిక తమను నిద్ర లేపలేదని మరో అబద్ధం చెబుతుంది. ఈ సమయంలో మనోహరి మరోసారి కల...