Hyderabad, ఫిబ్రవరి 21 -- NNS 21st February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పిల్లల కేర్ టేకర్ గా అమర్ ఇంట్లోకి అడుగుపెడుతుంది అనామిక. అంజు ఆమెకు ఇల్లంతా తిప్పి చూపిస్తుంది. అంతేకాదు అనామిక అక్కడే ఉండటానికి అమర్ తోపాటు శివరాం, నిర్మల అంగీకరిస్తారు. మనోహరి, మిస్సమ్మ మాత్రం ఆందోళనగా ఉంటారు.

అనామికలాంటి అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే అమర్ సార్ ఏదైనా తప్పు చేయొచ్చని మిస్సమ్మకు నూరిపోస్తాడు రాథోడ్. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని ఆమె అనుకుంటుంది. ఉదయాన్నే వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలని ఆమెతో అంటుంది. అయితే అనామిక తన ఇంట్లో పరిస్థితిని చెప్పడంతో ఇక్కడే ఉండొచ్చు కదా అని శివరాం, నిర్మల అంటారు.

ఇంట్లో పైన మరో గది కూడా ఉందని, అందులో ఉండొచ్చని అంజు కూడా అంటుంది. దీనికి అమర్...