భారతదేశం, ఫిబ్రవరి 22 -- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన బెంచ్​మార్క్​ సూచీల్లో భారీ మార్పులను ప్రకటించింది. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) మార్చి 28, 2025 నుంచి ప్రారంభమయ్యే అర్ధ-వార్షిక పునర్వ్యవస్థీకరణలో.. నిఫ్టీ50 ఇండెక్స్​లోకి ప్రవేశించనున్నాయి. ఈ రెండూ చేరడం, న్యూ ఏజ్​ టెక్నాలజీ షేర్లపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సూచిస్తుంది. అంతేకాదు, భారతదేశం అత్యంత విస్తృతంగా ట్రాక్ చేసే దేశీయ బెంచ్​మార్క్​ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్​కి డిజిటల్-యుగం స్టాక్స్ మొదటి చేర్పులను సూచిస్తుంది.

నిఫ్టీ 50 ఇండెక్స్ రివిజన్ల ప్రకారం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్...