భారతదేశం, మార్చి 30 -- వోక్స్​వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ భారత మార్కెట్​లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బ్రాండ్ ఇప్పటికే ప్రీ-బుకింగ్​లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ ఎస్​యూవీ సీబీయూ మార్గం ద్వారా వస్తుంది. ఇప్పుడు వోక్స్​వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్​లోని కొన్ని ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.

వోక్స్​వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎల్​ఈడీ ప్లస్ హెడ్​ల్యాంప్స్, యానిమేటెడ్ 3డీ ఎల్​ఈడీ రేర్ కాంబినేషన్ ల్యాంప్​తో వస్తుందని సంస్థ వెల్లడించింది. త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ ప్లస్, రెండు వైర్ లెస్ ఛార్జర్లు వంటివి ఇందులో ఉన్నాయి.

వీటితో పాటు వోక్స్​వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్​యూవీలో 30 కలర్ యాంబియంట్ లైటింగ్, ఆర్ బ్యాడ్జింగ్​తో కూడిన సీట్లు, డైమండ్ కట్ ఫినిషింగ్​తో కూడిన 19 ఇంచ్​ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. క్యాబిన్​కు గాలి అనుభూతిన...