Hyderabad, ఏప్రిల్ 21 -- New Serial: స్టార్ మా సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు ఎంతటి సంచలనం రేపాయో మనకు తెలుసు. ఈ రెండూ టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్ సాధించాయి. ఈ రెండింటినీ భూమి ఎంటర్టైన్మెంట్సే నిర్మించింది. అలాంటి నిర్మాణ సంస్థ నుంచి ఇప్పుడు సరికొత్త సీరియల్ రాబోతోంది. అయితే ఆ సీరియల్ స్టార్ మాలో కాకుండా ఈటీవీలోకి రానుంది.

బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్స్ కంటే ముందు భూమి ఎంటర్టైన్మెంట్స్ చెల్లెలి కాపురం అనే మరో సీరియల్ ను కూడా నిర్మించింది. ఇక వీటి తర్వాత నిండు మనసులు అనే మరో సీరియల్ కూడా రానుంది. ఇది కూడా స్టార్ మాలోనే. భూమి ఎంటర్టైన్మెంట్స్ కు ఇది నాలుగో సీరియల్.

తన ప్రతి సీరియల్ ను స్టార్ మాలోనే నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఈటీవీ కోసం కొత్త సీరియల్ చేస్తోంది. ఈ ఐదో సీరియల్ గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ అ...