భారతదేశం, అక్టోబర్ 13 -- నీట్ యూజీ విద్యార్థులకు భారీ శుభవార్త అందించింది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ). 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి, దేశవ్యాప్తంగా 812 వైద్య కళాశాలల్లో 9,075 కొత్త ఎంబీబీఎస్​ సీట్లను జతచేస్తూ సీట్ మ్యాట్రిక్స్‌ను సవరించింది. ఈ విస్తరణతో మొత్తం ఎంబీబీఎస్​ సీట్ల సంఖ్య.. 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్న 1,17,750 నుంచి ఏకంగా 1,26,600కు పెరిగింది!

ఈ పెంపు కారణంగా, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు లాభం చేకూరనుంది. వారు కోరుకున్న కళాశాలల్లో సీటు దక్కే అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఎన్​ఎంసీ అధికారిక వెబ్‌సైట్ (nmc.org.in)లో ఈ సవరించిన సీట్ మ్యాట్రిక్స్ అందుబాటులో ఉంది.

కొత్తగా మంజూరైన సీట్లు, కళాశాలల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఉత్తరప్రదేశ్, పశ్చిమ్​ బెంగాల్-

పశ్చిమ్​ బెంగాల్‌లో రెండు కొత్త వైద్య కళాశ...