భారతదేశం, ఫిబ్రవరి 14 -- New FASTag rules: ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపులు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మారబోతున్నాయి. 2025 ఫిబ్రవరి 17 నుంచి టోల్ ప్లాజాల వద్ద లావాదేవీలు సజావుగా జరిగేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ధ్రువీకరణ నిబంధనలను అమలు చేయనుంది. అందుకు అనుగుణంగా, వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే, ఎప్పటికప్పుడు, తమ ఫాస్టాగ్ అకౌంట్ లను అప్ డేట్ చేసుకోవాలి. అలా చేయడంలో విఫలమైన ఫాస్టాగ్ వినియోగదారులు పెనాల్టీలు, అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

జనవరి 28, 2025 న జారీ చేసిన తాజా ఎన్పీసీఐ సర్క్యులర్ ప్రకారం, ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు స్కానింగ్ సమయం, అకౌంట్ స్టేటస్ ఆధారంగా ధృవీకరించబడతాయి. అలాగే, రెండు సమయ ఆధారిత షరతులు కూడా రానున్నాయి.

ఒక ఫాస్టాగ్ ఖాతా ఎన్పీసీఐ మార...