Hyderabad, మార్చి 19 -- Netflix Web Series: కొత్త నెట్‌ఫ్లిక్స్ షో "అడోలెసెన్స్ (Adolescence)" సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఫిలిప్ బరాంటిని దర్శకత్వం వహించిన నాలుగు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ గత వారం మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ షో ఎక్కువగా కొత్త నటీనటులతో, తక్కువ ప్రమోషన్‌తో వచ్చినా కూడా ఈ స్థాయి ఆదరణ దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది మీ వాచ్ లిస్ట్‌లో ఎందుకు ఉండాలో చెప్పడానికి మూడు కారణాలను ఇక్కడ ఇస్తున్నాం.

ఈ అడోలెసెన్స్ వెబ్ సిరీస్ లో కేవలం నాలుగే ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ఒక్కో ఎపిసోడ్‌ను ఒకే సింగిల్ టేక్ లో తీయడం అసలు విశేషం. కెమెరా ఎక్కువసేపు ఒకే చోట ఉండదు కాబట్టి వన్-షాట్ టెక్నిక్ నమ్మశక్యం కాదు. ఇది ఎలా సాధ్యమైందో సినిమాటోగ్రాఫర్ మాథ్యూ లూయిస్ వెరైటీకి ఇచ్చ...