Hyderabad, ఏప్రిల్ 16 -- Netflix Telugu Movie: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే వచ్చిన బ్లాక్‌బస్టర్ తెలుగు మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. గత శుక్రవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమా రికార్డు వ్యూస్ తో గ్లోబల్ ట్రెండింగ్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో టాప్ 5లోకి రావడం విశేషం.

టాలీవుడ్ నుంచి ఈ మధ్యకాలంలో ఓ చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయం సాధించింది కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి, శివాజీలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ అలాగే దూసుకెళ్తోంది.

ఈ సినిమాకు ఇప్పటి వరకూ 22 లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేకాదు మొత్తంగా 54 లక్షల గంటలపాటు వ్యూయింగ్ టైమ్ ను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. మొత్తంగా గ్లోబల్ ట్రెండింగ్స...