భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇండియన్ ఓటీటీ చరిత్రలో 'లస్ట్ స్టోరీస్' (Lust Stories) వెబ్ సిరీస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడవాళ్ల సెక్సువల్ కోరికలు, సంబంధాలలోని సంక్లిష్టతలను అత్యంత బోల్డ్ గా, నిజాయితీగా ఆవిష్కరించిన ఆంథాలజీగా దీనికి మంచి పేరుంది. 2018లో వచ్చిన మొదటి సీజన్, 2023లో వచ్చిన రెండో సీజన్ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజీ మూడో సీజన్‌తో రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మూడు సీజన్లు పూర్తి చేసుకుంటున్న మొట్టమొదటి ఆంథాలజీగా ఇది నిలవనుంది.

నెట్‌ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ ఫ్రాంఛైజీ తెలుసు కదా. రెండో సీజన్ లో తమన్నా కూడా చాలా బోల్డ్ గా నటించింది. ఇప్పుడీ ఆంథాలజీ మూడో సీజన్ రానుంది. ఈసారి కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నటీనటులతో 'లస్ట్ స్టోరీస్ 3' వస్తోంది. నాలుగు వే...