Hyderabad, మార్చి 26 -- Netflix Most Watched: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ నెల రెండో వారంలో అడుగుపెట్టిన ఓ నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ ను కేవలం ఒకే షాట్ లో షూట్ చేయడం ఈ షో స్పెషాలిటీ. తొలి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ రివ్యూలతో అడొలసెన్స్ (Adolescence) అనే వెబ్ సిరీస్ కు 11 రోజుల్లోనే ఏకంగా 66.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ అడొలసెన్స్ వెబ్ సిరీస్ మార్చి 13న అడుగుపెట్టింది. కేవలం నాలుగు ఎపిసోడ్లతోనే ఈ సిరీస్ వచ్చింది. వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. స్టీఫెన్ గ్రాహమ్, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహర్తీ నటించిన ఈ సిరీస్ లోకి ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్ లో చిత్రీకరించడం విశేషం.

వెరైటీ మ్యాగజైన్ ప్రకారం....