భారతదేశం, మార్చి 9 -- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ లేదా నీట్ యూజీ 2025 అభ్యర్థులకు కీలక అలర్ట్​! దరఖాస్తులో వివరాలను సరిదిద్దడానికి కరెక్షన్​ విండో నేడు ఓపెన్​ అవుతుంది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే వెల్లడించింది.

"2025 మార్చ్​ 9న కరెక్షన్​ విండో ఓపెన్​ అవుతుంది," అని ఎన్టీఏ కొన్ని రోజుల క్రితం పేర్కొంది.

తమ దరఖాస్తు ఫారాలను సమర్పించి, వాటిల్లో ఏవైనా వివరాలను సరిచేయాలనుకునే అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్​ని సందర్శించడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ నీట్​ యూజీ కరెక్షన్​ విండో మార్చ్​ 11 వరకు ఓపెన్​గా ఉంటుంది. అంటే, ఈ 3 రోజులు వివరాలను సరిచేసుకోవచ్చు.

నీట్ యూజీ 2025 మే 4న ఆఫ్​లైన్ విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్ట్​లో జరగనుం...