భారతదేశం, మార్చి 18 -- నీట్ పీజీ 2025పై బిగ్​ అప్డేట్​! పరీక్ష నిర్వహణ తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీని 2025 జూన్ 15న నిర్వహించనున్నట్లు బోర్డు తన వెబ్​సైట్​ natboard.edu.in లో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ నీట్​ పీజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.

"నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్-పీజీ 2025 పరీక్ష 2025 జూన్ 15న కంప్యూటర్ ఆధారిత ప్లాట్​ఫామ్​పై రెండు షిఫ్టుల్లో జరుగుతుంది," అని నోటిఫికేషన్​లో ఉంది.

నీట్ పీజీ 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్​ని త్వరలో అధికారిక వెబ్​సైట్​లో షేర్ చేస్తామని నోటిఫికేషన...