భారతదేశం, మార్చి 7 -- Narasaraopet Mla: ఏపీ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం హంగామా చేశారు. దాదాపు మూడు గంటల పాటు కమిషనర్‌ ఛాంబర్‌లో బైఠాయించి హడావుడి చేశారు. పలువురు మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు.

ఏపీ ఎక్సైజ్ కమిషనర్‌ నిషాంత్‌ కుమార్‌ ఛాంబర్‌లో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. ఐఏఎస్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ చాంబర్‌కు వెళ్లిన ఎమ్మెల్యే తాను చెప్పిన పని చేసే వరకు కదలనంటూ బైఠాయించారు.

గుంటూరు జిల్లా మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్‌సోరింగ్‌ ఉద్యోగులను మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం లేఖ పంపారు. నరసరావుపేటలో ఎక్సైజ్‌ శాఖకు చెందిన మద్యం డిపోలో 11మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వార...