Hyderabad, ఏప్రిల్ 22 -- Nani on Malayalam Movies: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సాధారణ తెలుగు ప్రేక్షుకుల్లాగే మలయాళం సినిమాలకు ఫిదా అయిపోయాడట. తన నెక్ట్స్ మూవీ హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా అతడు మలయాళం మూవీస్ గురించి మాట్లాడాడు. ఆ సినిమాలు చూడటానికి కారణమేంటన్నదానితోపాటు ఫేవరెట్ సినిమాల గురించి కూడా వెల్లడించాడు.

మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ట్రాన్స్ మూవీ చూసిన తర్వాతే తాను ఆ ఇండస్ట్రీ సినిమాల పట్ల ఆకర్షితుడైనట్లు నాని వెల్లడించాడు. ఈ మూవీ 2020లో రిలీజైంది. ఆ మూవీ చూసిన తర్వాత తన దిమ్మదిరిగిపోయినట్లు నాని చెప్పాడు. దీంతో ఆ ఏడాది కొవిడ్ సమయంలో వరుసబెట్టి మలయాళం సినిమాలన్నీ తాను చూసినట్లు నాని చెప్పాడు.

ఇక తనకు నచ్చిన మలయాళం సినిమాల గురించి కూడా అతడు వెల్లడించాడు. ఫహాద్ ఫాజిలే నటించిన కుంబలంగి నైట్స్, ఆవేశం, దుల్కర్ సల్మాన్ నటించి...