భారతదేశం, ఏప్రిల్ 2 -- నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్‍బస్టర్లు సాధించారు. నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ఆ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేయనున్న ది ప్యారడైజ్ చిత్రం ఒక్క గ్లింప్స్‌తోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా హీరో నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

తాను కొన్నేళ్లుగా చాలా కథలను విన్నానని నాని చెప్పారు. కచ్చితంగా బ్లాక్‍బస్టర్ అవుతాయని తాను నమ్మిన కొన్ని కథలను, వాటికి మరింత బాగా సూటయ్యే నటులకు చెప్పాలని నిర్మాతలు, దర్శకులకు సూచించినట్టు నాని తెలిపారు.

మంచి సినిమాను సపోర్ట్ చేయడమే తన బాధ్యత అని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చెప్పా...