భారతదేశం, మార్చి 1 -- సూపర్ హిట్ అయిన ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మలయాళంలో రిలీజై బ్లాక్‍బస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషల్లోకి వస్తోంది. ఈ చిత్రం బాగా పాపులర్ అవటంతో ఓటీటీలోకి ఎంట్రీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ సినిమానే 'రేఖాచిత్రం'. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే వెల్లడైంది.

రేఖాచిత్రం మూవీపై థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడిచింది. దీంతో ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. దీంతో ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూసేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

రేఖాచిత్రం సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈనెల(మార్చి) 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరోవారంలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తె...