భారతదేశం, సెప్టెంబర్ 28 -- శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలమవుతోంది. అంతేకాదు, ముంబై సహా చుట్టుపక్కన ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్​ అలర్ట్​ ప్రకటించడంతో ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తంభించింది, అనేక రోడ్లు జలమయం అయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ముంబై, థానే, రాయ్‌గడ్, పాల్ఘర్ జిల్లాల్లో ఐఎండీ 'రెడ్ అలర్ట్‌'ను ప్రకటించింది. ఈ హెచ్చరిక సోమవారం ఉదయం వరకు అమల్లో ఉంటుంది. అంతేకాకుండా రాబోయే కొన్ని గంటల్లో ముంబై, రాయ్‌గడ్, పాల్ఘర్‌లలో భారీ వర్షపాతం, బలమైన గాలులు, మెరుపులు ఉంటాయని హెచ్చరిస్తూ మరో 'రెడ్ అలర్ట్‌'ను సైతం జారీ చేసింది.

ఆదివారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో ముంబైలో 71.9...